ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ పార్థివ దేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. లాలాపేట జీహెచ్ఎంసీ స్టేడియంలో అందెశ్రీ పార్థిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అందెశ్రీ గారి సేవలు, రచనలు, పాటలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. వారి మరణం తెలంగాణ సమాజానికి, సాహిత్యానికి తీరని లోటు అని వ్యాఖ్యానించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానని తెలిపారు. అందెశ్రీ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.