అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు నగర వ్యాప్తంగా సోమవారం ఘనంగా
నిర్వహించుకున్నారు. సోదరీమణులు అన్నదమ్ములకు రాఖీలు కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఒకరికొకరం రక్ష అంటూ ఆనందోత్సాహాలతో గడిపారు.
కాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్కు పలువురు కార్పొరేటర్లు, మహిళలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు పద్మారావు, మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులకు సోదరీమణులు రాఖీలు కట్టి సందడి చేశారు.