ఎల్బీనగర్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్వైపే ఉన్నారని, ఉప ఎన్నికల్లో ఘన విజయం ఖాయమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ‘నమస్తే’తో మాట్లాడారు. కేసీఆర్ హైదరాబాద్‌లో చేసిన అభివృద్ధిని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలన చూసిన ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారన్నారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రజల మనిషని అన్నారు. మాగంటి నాయకత్వంలో జూబ్లీహిల్స్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు. కాంగ్రెస్ ఎంత శ్రమించినా, అధికార దుర్వినియోగం చేసినా, డబ్బులు ఖర్చు పెట్టినా గెలిచే ప్రసక్తే లేదన్నారు. ఎక్కడికి వెళ్లినా.. ప్రజలు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, తులం బంగారం, 4వేల పింఛన్లు, యువతకు ల్యాప్‌టాప్‌లు, స్కూటీలు వంటి వాటిపై కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తున్నారన్నారు. నగరంలో కనీసం మంచినీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, విద్యుత్ సరఫరా కూడా సరిగాలేదన్నారు.