ఆర్టిజన్ల సమ్మెకు బీఆర్ఎస్ మద్దతు
విద్యుత్ సంస్థలో పని చేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి బీఆర్స్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఆ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్జి పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి ప్రకటించారు.
- రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి
మణికొండ/ మైలార్‌దేవ్‌పల్లి, ఏప్రిల్ 16: విద్యుత్ సంస్థలో పని చేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి బీఆర్స్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఆ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్జి పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి ప్రకటించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ ఆరు ప్రధాన డిమాండ్లతో ఇబ్రహీంబాగ్ డివిజన్ ఆఫీసు ఎదుట కార్మికులు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో గురువారం ఆయన పాల్గొని మద్దతు పలికారు. కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ రంగం పురోభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టిజన్ల పట్ల ప్రభుత్వం వివక్ష చూపడం తగదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్యోగుల సమస్యల పరిష్కరానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన మాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో నార్సింగి మున్సిపల్ అధ్యక్షులు విష్ణువర్ధన్‌రెడ్డి, రాజేంద్రనగర్ మైనార్టీ ఇన్చార్జి ముక్తార్, గణేష్ ముదిరాజ్, శ్రీకాంత్‌రెడ్డి, చిరంజీవి, రాజు, విద్యుత్ కార్మికులు పాల్గొన్నారు.
శివరాంపల్లి సబ్‌స్టేషన్ పరిధిలో..
సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శివరాంపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ఆర్టిజన్లు చేపట్టిన నిరసన కార్యక్రమానికి రాజేంద్రనగర్ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో కాటేదాన్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎస్.వెంకటేష్, శాస్త్రీపురం డివిజన్ అధ్యక్షులు ముక్రంఖాన్, సులేమాన్‌నగర్ డివిజన్ అధ్యక్షులు జహీర్‌ఖాన్, అహ్మద్‌పటేల్, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు రాఘవేందర్‌యాదవ్, జగదీష్, సూర్యం, సునీల్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

