మైలార్‌దేవ్‌పల్లి, ఏప్రిల్ 18: వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో 27న నిర్వహించే రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు ప్రతినాయకుడు, కార్యకర్త తరలిరావాలని రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జీ పట్లోళ్ల కార్తిక్‌రెడ్డి కోరారు.
శుక్రవారం అత్తాపూర్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం ప్రత్యేక కార్యచరణలు రూపొందించి ప్రణాళికతో ముందుకు సాగాలని గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకువచ్చి రానున్న ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేలా కష్టపడి పని చేయాలన్నారు.