బోడుప్పల్, జూన్ 25: బోడుప్పల్, చెంగిచర్ల డివిజన్లలో నెలకొన్న తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్, సిగురు రేణుక రవి ఆధ్వర్యంలో గురువారం పెద్ద సంఖ్యలో కాలనీవాసులు, మహిళలు ఖాళీ బందెలతో ప్లకార్డులు పట్టుకొని జలమండలి కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోడుప్పల్, చెంగిచర్ల పరిధిలో వారానికి ఒకసారి మాత్రమే తక్కువ ప్రెషర్‌తో నీటిని సరఫరా చేయడంతో సరిపడా నీరు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. పన్నులు క్రమం తప్పకుండా వసూలు చేస్తున్న అధికారులు కనీస అవసరమైన తాగునీటిని అందిచడంలో పూర్తిగా విఫలమయ్యారని , ఎన్నిపార్లు వినతి పత్రాలను ఇచ్చినా స్పందించడం లేదని ఆగ్రహం
వ్యక్తం చేవారు.