చర్లపల్లి, నవంబర్ 6 : అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఉప్పల్ నియోజకవర్గం అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, రాష్ట్ర నాయకుడు ఉప్పల శ్రీనివాస్గుప్తాలు పేర్కొన్నారు. సోమవారం ఏఎస్‌రావునగర్ డివిజన్ పరిధిలోని వాసవి భవన్లో మేడ్చల్ జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు కాసం వెంకటహరి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతు ప్రకటించి ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం అభ్యర్థి బండారి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంను అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశార ని, దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రజా సంక్షేమ పాలన సాగిస్తున్నారని అన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి కృషి చేశారని, ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తే ఆర్యవైశ్యుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. గత ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో లేని పథకాలను కేసీఆర్ ప్రేవేశపెట్టి అన్ని వర్గాలు ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా చర్యలు తీసుకున్నారన్నారని గుర్తు చేశారు. ప్రత్యేక చొరవతో ఉప్పల్‌ను అన్ని రం గాల్లో అభివృద్ధి చేశారని, అమలుకాని హామీలను గుప్పిస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు తగు రీతిలో బుద్ధి చెప్పాలని కోరారు. ఆర్యవైశ్యులు కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, గొల్లూరి అంజయ్య, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కాసం మహిపాల్‌రెడ్డి, ఆర్యవైశ్య సంఘం నాయకులు పెద్ది నాగరాజు, పెద్ది శ్రీనివాస్, నాగేశ్వర్రావు పాల్గొన్నారు.