కంటోన్మెంట్ పరిధిలోని ఐదో వార్డులో బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి.లాస్యనందిత పర్యటించారు. వార్డు పరిధిలోని వాల్మీకి సామాజికవర్గం పెద్దలను కలిసి తాను సాయన్న బిడ్డనని పరిచయం చేసుకోగా.. మా ఓటు నీకే బిడ్డా అంటూ వారు ఆశీస్సులు అందజేశారు.
– మారేడ్పల్లి, ఆగస్టు 30