కేపీహెచ్‌బీ కాలనీ, నవంబర్ 5: జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌ను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి, బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ పగుడాల శిరీషాబాబురావు ఓటర్లను కోరారు.
బుధవారం ఎర్రగడ్డ డివిజన్లో వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో పూర్తిగా విఫలమైందని వారు ఆరోపించారు. కారు గుర్తుకు ఓటువేసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.