బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగు ళ్ల పద్మారావు గౌడ్ కలిసి ఈ నెల 21న జరిగే సికింద్రాబాద్ బోనాల వేడుకలకు రావాలని కోరారు. శుక్రవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ను కలిసి బోనాల వేడుకలకు, విందుకు హాజరు కావాలని ఆహ్వానించారు. పద్మారావుగౌడ్తో పాటు ఆయన కుమారులు తీగుళ్ల కిశోర్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, త్రినేత్ర గౌడ్, కళ్యాణ్ , నాయకులు సుంకు రాంచందర్ తదితరులు ఉన్నారు.
– సికింద్రాబాద్, జూలై 19