MLC Shambipur Raju | మేడ్చల్ మల్కాజ్గిరి : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఫోన్‌ను గుర్తు తెలియని దుండగులు హ్యాక్ చేశారు. దీంతో తన వ్యక్తిగత, అధికారిక సమాచార భద్రతపై శంభీపూర్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు. తన ఫోన్ హ్యాకింగ్‌పై దుండిగల్ పోలీసు స్టేషన్‌తో పాటు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫిర్యాదు చేశారు.
తాను ఇచ్చిన ఫిర్యాదుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఎమ్మెల్సీ కోరారు. తన పేరిట ఎవరైనా కాల్స్ చేస్తే, వాటిని నమ్మొద్దని ప్రజలకు శంభీపూర్ రాజు విజ్ఞప్తి చేశారు.