బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సమరశంఖం పూరించేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఇందులోభాగంగా చేపట్టే నిరసన కార్యక్రమాల విజయవంతానికి సోమవారం వివిధ చోట్ల విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను దగా చేస్తున్నదని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలపై గండిమైసమ్మలోని జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ.. ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను దగా చేస్తున్నదని మండిపడ్డారు.
కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా వైఫల్య పాలన కొనసాగిస్తున్నదన్నారు. ఏఎస్‌రావునగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టబోయే నిరసన కార్యక్రమాలపై నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేయాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి బోయిన్‌పల్లిలోని తన నివాసంలో మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సమరభేరి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి సర్కార్.. ఆరు గ్యారెంటీలు, 420 హామీలను ఎప్పుడు అమలు చేస్తుందో ప్రజలకు చెప్పాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. క్యాంప్ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
– మేడ్చల్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ)/ దుండిగల్/కాప్రా/బడంగ్‌పేట/కేపీహెచ్‌బీకాలనీ
దుండిగల్,ఆగస్టు31: ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను దగా చేస్తుందని బీఆర్ఎస్ ఎల్పీ విప్,ఎమ్మెల్యే కేపీ వివేకానంద్,ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్‌రాజు, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నేటి నుంచి 7వ తేదీ వరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో నిర్వహించనున్న ‘సమరశంఖం’ కార్యక్రమాలపై సోమవారం గండిమైసమ్మలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
బడంగ్పేట్: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. జిల్లెలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహేశ్వరం నియోజక వర్గం బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.

అర్హులైన పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు పెద్ద బావి ఆనంద్ రెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డి, భూపేశ్‌గౌడ్, అనిల్ కుమార్ యాదవ్, రజాక్, శ్రీను నాయక్, రాజు నాయక్, జయందర్ ముదిరాజ్, భూపాల్ రెడ్డి, కామేశ్‌రెడ్డి, అరవింద్ శర్మ, బీరప్ప, శ్రీనివాస్ రెడ్డి, సంతోష్, గట్టు మైపాల్, శ్రీనివాస్ రెడ్డి, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి సమస్యలను పట్టించుకోకుండా వైఫల్య పాలన కొనసాగిస్తుందని ఎమ్మెల్యే వివేకానంద్ విమర్శించారు. ఆరు గ్యారెంటీల నుంచి రైతుభరోసా,రుణమాఫీ,ఉచిత విద్యుత్ వరకు అన్నింటిని విస్మరించిందన్నారు.

మహిళలు,విద్యార్థులు,నిరుద్యోగులు,ఉద్యోగులు,రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైందన్నారు. వైఫల్యాలను ప్రజల్లోకి కార్యకర్తలు,నేతలు విస్తృతంగా తీసుకువెళ్లి ఎండగట్టాలని సూచించారు.
కేపీహెచ్‌బీ కాలనీ, ఆగస్టు 31 : అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి సర్కార్..ఆరు గ్యారెంటీలు, 420 హామీలను ఎప్పుడు అమలు చేస్తారో ప్రజలకు చెప్పాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. సోమవారం క్యాంప్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైన అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అధికారంలోకి రాగానే రూ.4వేల పింఛన్, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, వంద రోజుల్లోనే ఇచ్చిన హామీలనన్నింటిని నేరవేరుస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై బీఆర్ఎస్ పోరుబాట చేపడుతుంన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నగరంలోని పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను ఉచితంగా కేటాయిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం 6 లక్షలు కడితేనే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పడం సరికాదని, డబ్బులు ఉన్నవాళ్లకే ఇండ్లు ఇస్తే… పేదవాని పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మాధవరం రంగారావు, సతీశ్‌గౌడ్, రవీందర్‌రెడ్డి తదితరులు పల్గొన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు పరచకుండా మోసగించిన కాంగ్రెస్ పార్టీ పై సమరభేరి నిర్వహించాలని ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు కార్యకర్తలకు సూచించారు.నేటి నుంచి 7తేదీ వరకు పార్టీ అధిష్ఠానం సూచించిన తరహాలో చేపట్టే కార్యక్రమాల్లో కార్యకర్తలు,నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఆరు గ్యారెంటీలు ఎక్కడ..అమలు ఏదంటూ ప్రభత్వాన్ని ప్రశ్నించాలన్నారు. ప్రజాపాలన పేరుతో 1000 రోజుల్లో కొనసాగించిన విధ్వంస పాలనను నిలదీయాలని సూచించారు.
రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో దొంగల పాలన నడుస్తుందని మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ఎటువంటి మేలు చేయకపోగా అన్నివర్గాల ప్రజలను మోసగించిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత నేతలు,కార్యకర్తలపైనే ఉందన్నారు.
కాప్రా, ఆగస్టు 31: కాంగ్రెస్ వెయ్యి రోజు ల వైఫల్య పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లి నిరసన కార్యక్రమాలను నిర్వహించేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పిలుపు ఇచ్చా రు. సోమవారం ఏఎస్‌రావునగర్‌లోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అధ్యక్షతన పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు కొత్తరామారావు, శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుదాస్, దేవేందర్‌రెడ్డి, గొల్లూరి అంజయ్య, పార్టీ సీనియర్ నేతలు సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, కాసం మహిపాల్‌రెడ్డి, సాయిజెన్‌శేఖర్, బద్రుద్దీన్, బన్నాల ప్రవీణ్,గంధం నాగేశ్వరావు,ప్రభాకర్‌రెడ్డి, బేతాలబాలరాజు, షేర్మణెమ్మ, మహేశ్‌గౌడ్, ముత్యంరెడ్డి పాల్గొన్నారు.