MLA Vivekananda | దుండిగల్, జూన్ 20 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామనీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గాజుల రామారం డివిజన్ ఒక్షిత హిల్ వ్యూ కాలనీలో రూ. 60 లక్షల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు పనులకు వివేకానంద శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా, ప్రజా సంక్షేమమే పరమావధిగా అభివృద్ధి పరుస్తున్నామని అన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, శివారు ప్రాంతాలలో రోజురోజుకు వెలుస్తున్న కొత్త కాలనీలలో మౌలిక వసతుల కల్పనను ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నామన్నారు. రానున్న రోజుల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి సర్వతోముఖాభివృద్ధిగా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం ఒక్షిత హిల్ వ్యూ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, ఒక్షిత హిల్ వ్యూ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణ గౌడ్, ఉపాధ్యక్షులు సి. నాగరాజు, అడ్వైజర్ ఎం. సురేంద్ర, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి నవాబ్ భాయ్, సీనియర్ నాయకులు తెలంగాణ సాయి, మూసా ఖాన్, చెట్ల వెంకటేష్, చందు సుంకరి, బోయిని మహేష్, చిన్నా చౌదరి, బాబీ చౌదరి, దూలప్ప, సమ్మయ్య యాదవ్, రాములు గౌడ్, కరుణాకర్ రాజు, శివా నాయక్, జునైద్, ప్రసాద్, గౌస్, వాహీద్, మహిళా అధ్యక్షురాలు సంధ్యా తదితరులు పాల్గొన్నారు.