MLA Talasani | బేగంపేట్, జూన్ 26 : ఓల్డ్ కస్టమ్ బస్తీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం ఆయన బేగంపేట డివిజన్లోని ఓల్డ్ కస్టమ్ బస్తీ మొత్తం అధికారులతో కలిసి కాలినడకన పర్యటించారు. ప్రధానంగా బస్తీలో రోడ్లు, సీవరేజ్ సమస్య గురించి ఎమ్మెల్యే దృష్టికి స్థానిక ప్రజలు తీసుకొచ్చారు. రోడ్లు మొత్తం అధ్వాన్నంగా మారాయని, సీవరేజ్ లైన్ సక్రమంగా లేకపోవడం వలన వర్షం కురిస్తే రోడ్లపై నీరు నిలిచిపోతుందని స్థానికులు వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలోనే రోడ్లను మంజూరు చేయించడం జరిగిందని, కానీ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి పనులు రద్దు అయ్యాయని గుర్తు చేశారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వాటి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవసరమైన చోట్ల నూతన రోడ్ల నిర్మాణం, సీవరేజ్ లైన్ల ఏర్పాటు కోసం వెంటనే ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా బస్తీలో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరగా, అవసరమైన ప్రాంతాలలో స్తంభాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బస్తీ వాసుల అవసరాల దృష్ట్యా కమిటీ హాల్‌పై మరో ఫ్లోర్ నిర్మించాలని ఎమ్మెల్యేను స్థానికులు కోరగా, చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని స్థానిక మహిళలు తెలపగ, పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నుండి ఖబరస్థాన్ వద్దకు చేరుకొని పరిశీలించారు. ఇక్కడ అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, పనులను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని అక్కడి నుండే నార్త్ జోన్ జోనల్ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడి ఆదేశించారు. అంతకు ముందు బ్రాహ్మణ వాడిలో లైన్ 1లో రూ. 8 లక్షలు, మెయిన్ రోడ్లో రూ. 13 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ పైప్ లైన్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈఈ సుబ్రహ్మణ్యం, వాటర్ వర్క్స్ డీజీఎం ఆశిష్, టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు శేఖర్ ముదిరాజ్, అఖిల్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.