MLA Sudheer Reddy | చంపాపేట, ఫిబ్రవరి 27 : నియోజవర్గం పరిధిలో ఎక్కడ సమస్యలు తలెత్తినా తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తాననీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. చంపాపేట డివిజన్ పరిధి కర్మన్‌ఘాట్ డిఫెన్స్ కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, బీఆర్ఎస్ చంపాపేట డివిజన్ అధ్యక్షుడు ముడుపు రాజ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని తన క్యాంపు కార్యాలయంలో కలిశారు. తమ కాలనీలో నిధుల లేమితో నిలిచిపోయిన కమ్యూనిటీ హాల్ పునఃనిర్మించేలా చూడాలని కోరారు. అదే విధంగా కాలనీలో నెలకొన్న తాగునీటి లోఫ్రెషర్ సమస్య, విద్యుత్ లో ఓల్టేజీ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యేకు డిఫెన్స్ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు.
ఈ విషయమై ఎమ్మెల్యే స్పందించి నియోజకవర్గం పరిధిలో ఎక్కడ సమస్యలు తలెత్తినా తన దృష్టికి తీసుకువస్తే వాటిని తప్పకుండా పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తాననీ కాలనీవాసులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు, బీఆర్ఎస్ చంపాపేట డివిజన్ ప్రధాన కార్యదర్శి ఐలపాక ఉమామహేశ్వర్, బీఆర్ఎస్ ఎల్బీనగర్ యూత్ అధ్యక్షుడు రవిముదిరాజ్, మాజీ డివిజన్ ప్రెసిడెంట్ చీర శ్రీనివాస్, సీనియర్ నాయకులు మేక సురేందర్‌రెడ్డి, సదానందరెడ్డి ముద్ద కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.