BRS | మన్సురాబాద్, ఏప్రిల్ 9: వరంగల్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకు ప్రజలను పెద్ద ఎత్తున తరలించేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి సూచించారు. ఈనెల 27న వరంగల్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ నేపథ్యంలో ముఖ్య కార్యకర్తల సన్నహాక సమావేశాన్ని బుధవారం మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని ఎంఈ రెడ్డి గార్డెన్లో నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి.. కార్యకర్తలు, నాయకులకు పలు సలహాలు, సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. కనీవిని ఎరుగని రీతిలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ జరగబోతుందని తెలిపారు. రజతోత్సవ మహాసభకు ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా భారీ ఎత్తున ప్రజలు వరంగల్‌కు తరలేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వరంగల్ మహాసభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసే ప్రసంగంపై ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారని అన్నారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేస్తూ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్ రెడ్డి, సామ తిరుమల్ రెడ్డి, భవాని ప్రవీణ్ కుమార్, సాగర్ రెడ్డి, జిన్నారం విఠల్ రెడ్డి, నాయకులు పోచబోయిన జగదీశ్ యాదవ్, టంగుటూరి నాగరాజు, తూర్పాటి చిరంజీవి, కటిక రెడ్డి అరవింద్ రెడ్డి, ఆనంద్ యాదవ్, పారంధ నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.