కంటోన్మెంట్/బొల్లారం, అక్టోబర్ 18: బడుగు బలహీన వర్గాల అభివృద్ధే బీఆర్ఎస్ ధ్యేయమని సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత అన్నారు. కంటోన్మెంట్ బొల్లారం రిసాలబజార్, పయినీర్ బజార్తో పాటు పలు బస్తీల్లో స్థానిక నేతలతో కలిసి బుధవారం పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి తనను ఆశీర్వదించాలని సేవకురాలిగా పనిచేస్తానని లాస్యనందిత కోరారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి.. అమలు చేసిన సంక్షేమ పథకాలే ఎన్నికల అస్త్రాలని గుర్తు చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఒంటరి మహిళ, వితంతు పింఛన్లు ఇలా చెప్పుకుంటే పోతే అనేక సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుస్తున్నామన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో తెలంగాణ భవితకు సోపానమన్నారు.
కంటోన్మెంట్లోని బొల్లారం ప్రాంతంలో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత చేపట్టిన పాదయాత్రకు జనం నుంచి భారీ స్పందన లభించింది. పాదయాత్రలో భాగంగా ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ఎక్కడ పెద్దలు కనిపించినా ఆశీర్వాదం తీసుకున్నారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న సేవలను గుర్తుచేస్తూ.. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి లాస్యనందిత వివరించారు. పాదయాత్రలో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు లోక్నాథం, బీఆర్ఎస్ నాయకురాలు నివేదిత, బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు రవి, వెంకటేశ్ యాదవ్, జంగాల మురళీ యాదవ్, పింజర్ల మురళీ యాదవ్, ఉదయ్, ఉమేశ్, ప్రభు గుప్తా, రవీందర్ గుప్తా, టీఎన్ శ్రీనివాస్, నర్సింహ్మ ముదిరాజ్, పనస సంతోష్, సదానంద్ గౌడ్, తేజ్ పాల్, దీనానాథ్ యాదవ్, భాస్కర్ ముదిరాజ్, గజ్జె ల గోపాల్, గంగారామ్, శేఖర్, భాస్కర్ పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రూపొందించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లాస్య నందిత అన్నారు. ంటోన్మెంట్ ఏడో వార్డు బొల్లారం రిసాల బజార్లోని శ్రీ బుజిలీ మహంకాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళా నాయకురాలు నివేదిత,మాజీ చైర్మన్ ఖదీరవన్,టీఎన్ శ్రీనివాస్,వార్డు అధ్యక్షుడు కేజీ రవి కుమార్,పింజర్ల మురళీ యాదవ్, ఉదయ్, ఉమేష్, నర్సింహ ముదిరాజ్,తేజ్పాల్, సరిత,గంగారామ్, చంద ర్ తదితరులు పాల్గొన్నారు.