మల్లాపూర్, జూలై 30 : మల్కాజిగిరి ఎంపీ అయిన తరువాత నియోజకవర్గానికి ఒక్కసారైనా వచ్చావా? అసలు ప్రజల సమస్యలను పట్టించుకున్నావా? అని రేవంత్‌రెడ్డి పై ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను విమర్శించడం ఎంత వరకు సమంజసమని వెంటనే వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం మల్లాపూర్ చౌరస్తాలో కార్పొరేటర్లు పన్నాల దేవేందర్‌రెడ్డి, ప్రభుదాస్లతో కలిసి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.