ఘట్కేసర్,జూలై11:రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ ఘట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం అంబేద్కర్ విగ్రహం వద్ద రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సీఎం కేసీఆర్ 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేయడం,రైతుబంధు, రైతు బీమా అందిస్తుండడంతో కాంగ్రెస్,బీజేపీ నాయకులు చూడలేక పోతున్నారని అన్నారు.కాంగ్రెస్, బీజేపీ మరోసారి రైతుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని అన్నారు. కార్యక్రమంలో చైర్పర్సన్ ముల్లి జంగయ్య యాదవ్,మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి,మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మాధవ రెడ్డి,కౌన్సిలర్లు ఆంజనేయులు గౌడ్,బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్,సుధాకర్,శ్రీనివాస్ రెడ్డి,సుధాకర్‌రెడ్డి,ధర్మారెడ్డి కార్యకర్తలు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్,బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు
కీసర, జూలై 11: రైతాంగానికి కేసీఆర్ ప్రభుత్వం ఒకవైపు 24 గంటలపాటు ఉచిత కరెంట్ ఇస్తుంటే కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి కేవలం 3గంటల కరెంట్ సరిపోతుందని చెప్పడం విడ్డూరంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రైతులు తగిన రీతిలో బుద్ధ్ది చెప్పడం ఖాయమని జడ్పీ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కీసరలో మంగళవారం జడ్పీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ కోసం కేసీఆర్ రైతులు పండించిన పంటలకు భరోసా ఇస్తున్నాడని, దాంతో పాటు రైతులు పండించిన ధానాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాల్లో మూడు రోజుల్లో డబ్బులను జమ చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. రైతాంగానికి సకాలంలో విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయడంతో పాటు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను కల్పిస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రజల్లో పూర్తి విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అడ్రస్ లేకుండా గల్లంతు అవుతుందని అన్నారు.