Patolla Karthik Reddy | శంషాబాద్ రూరల్, మార్చి 17 : పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరు కలిసికట్టుగా పని చేయాలని రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి పటోళ్ల కార్తీక్‌రెడ్డి సూచించారు. సోమవారం శంషాబాద్ మున్సిపాలిటీలోని 10వ వార్డుకు చెందిన రాచమల్ల జయసింహ ఆధ్వర్యంలో పలువురు కార్తీక్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు.
ఈ సందర్భంగా కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. బీఎస్పీ నుంచి రాజేంద్రనగర్ ఎమ్మెల్యేగా పోటి చేసిన రాచమల్ల జయసింహ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. బీఆర్ఎస్లో చేరినప్పటి నుంచి సైలెంట్‌గా ఉన్న ఆయన పలువురు నాయకులతో కలిసి కార్తీక్‌రెడ్డిని కలిసి సన్మానించారు. పార్టీలో తనకు ఎలాంటి అవకాశం కల్పించిన పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని కార్తీక్‌రెడ్డికి వివరించిన్నట్లు జయసింహ తెలిపారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు. శంషాబాద్ మున్సిపాలిటీలో కొందరు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌లో చేరినా బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని చెప్పారు. ప్రజల బలం బీఆర్ఎస్కే ఉందని పేర్కొన్నారు. కార్తీక్‌రెడ్డిని కలిసిన వారిలో పెద్దగండు పవిత్రసాగర్, భాస్కర్, రాజ్‌కుమార్,సందీప్,శ్రావణ్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.