మైలార్‌దేవ్‌పల్లి, ఫిబ్రవరి 9: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి పట్లోళ్ల కార్తిక్‌రెడ్డి అన్నారు. ఉత్తుత్తి హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌కు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పట్లోళ్ల కార్తిక్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు కష్టాలు మొదలయ్యాయన్నారు.
దీనిని ప్రజలు తొందరగా అర్థం చేసుకోని కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధమవుతున్నారన్నారు. త్వరలోనే రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత కష్టపడి పని చేయాలన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా..బీఆర్ఎస్ సిద్ధంగా ఉండి అన్ని సీట్లను కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. బీఆర్ఎస్లో అందరికీ సముచిత స్థానం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.ఈశ్వర్, వై.వెంకటేశ్, రాముయాదవ్, రఘుయాదవ్, వెంకటేశ్, సోమ శ్రీనివాస్, అరుణ్ముదిరాజ్, డి.రమేశ్, జి.రాజు, మంచర్ల చిరంజీవి, సురేశ్ ముదిరాజ్, గంజి రాజు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.