మియాపూర్ , ఏప్రిల్ 8 : ఎమ్మెల్యే గాంధీపై సోషల్ మీడియాలో అభ్యంతకరంగా పోస్టులు పెట్టారనే కారణంతో శేరిలింగంపల్లి బీఆర్ఎస్ నేత రవియాదవ్పై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేయటంతో పాటు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యుడు, న్యాయవాది లక్ష్మణ్‌తో కలిసి బుధవారం ఠాణాలో నిర్వహించిన విచారణకు హాజరయ్యారు. తనకు జారీ చేసిన నోటీసులపై రవియాదవ్ లిఖిత పూర్వక సమాధానాన్ని సీఐకి అందించారు. కాగా విచారణ నేపథ్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆయనకు మద్దతుగా మియాపూర్ ఠాణాకు తరలివచ్చారు.
అనంతరం రవి మాట్లాడుతూ ప్రజల పక్షాన తమ పోరాటం ఎప్పటికీ కొనసాగుతుందని, తప్పుడు కేసులు ఎన్నటికీ నిలవవన్నారు. పడకేసిన అభివృద్ధిపై మున్ముందు కూడా తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శుభరాజ్, పార్టీ శ్రేణులు పురుషోత్తం, హరిష్‌రావు, సతీష్‌రావు, నవతారెడ్డి, శ్రీనివాస్‌రావు, రామకిషన్, రోజా, విజయ్, శ్రీనివాస్, కార్తీకేయ, అలావుద్దీన్, సురేష్, శ్రీకాంత్, సంగారెడ్డి, జమీర్, శివరాజ్, మల్లేష్, గణేష్, మజీద్, సంతోష్, ముజీబ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.