వీధి దీపాలు లేవు.. చెత్త తీసుకుపోరు
బస్తీలో వీధి దీపాలు లేవు...చెత్త పేరుకుపోయినా తీయడం లేదు.. ప్రమాదకరంగా మారిన చెట్ల కొమ్మలను తొలగించడం లేదంటూ బాలపుర బస్తీవాసులు బీఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి ఎదుట తమ సమస్యలను ఏకరువుపెట్టారు. బీఆర్ఎస్ సమస్యలపై సమరం కార్యక్రమంలో భాగంగా గురువారం ఎర్రమంజిల్ డివిజన్ పరిధిలోని బాలపుర బస్తీని ఆయన సందర్శించారు.
- సర్కార్ తీరుపై బీఆర్ఎస్ ఖైరతాబాద్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి ఫైర్
- బాలపుర బస్తీవాసుల సమస్యలపై సమరం
ఖైరతాబాద్, జూన్ 18: బస్తీలో వీధి దీపాలు లేవు…చెత్త పేరుకుపోయినా తీయడం లేదు.. ప్రమాదకరంగా మారిన చెట్ల కొమ్మలను తొలగించడం లేదంటూ బాలపుర బస్తీవాసులు బీఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి ఎదుట తమ సమస్యలను ఏకరువుపెట్టారు. బీఆర్ఎస్ సమస్యలపై సమరం కార్యక్రమంలో భాగంగా గురువారం ఎర్రమంజిల్ డివిజన్ పరిధిలోని బాలపుర బస్తీని ఆయన సందర్శించారు. స్థానికుల సమస్యలను సానుకూలంగా విన్న గోవర్ధన్‌రెడ్డి వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు ఫోన్ చేసి వాటిని పరిష్కరించాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్తీలో రోజురోజుకు సమస్యలు పేరుకుపోతున్నాయని.. అయినప్పటికీ ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడం సరికాదన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస నాయకులు శ్రీనివాస్, విష్ణు, మురళీ, అరుణ్, బలరాం, మదన్, సాయిలు, ధర్మేంద్ర, రావుల జగన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

