ఉప్పల్, అక్టోబర్ 24 : కారు ప్రచార స్పీడుతో దూసుకుపోతుంది. బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ప్రచారంలో నియోజకవర్గాన్ని చుట్టేశారు. ప్రచార రథాలు, ఆత్మీయ సమ్మేళనాలు, పలు పార్టీల నుంచి నేతల చేరికలతో పార్టీకి బలం చేకూరుతుంది. ఉప్పల్ నియోజకవర్గంలో ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి పది డివిజన్లలో ఆత్మీ య సమ్మేళనాలు పూర్తిచేశారు. డివిజన్ల వారీగా సమన్వయంతో గ్రూపులు లేకుండా ఏకతాటిపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నేతలు, కార్యకర్తలు ముందుకువచ్చి పనిచేస్తున్నారు. దీనితో గులాబీ పార్టీలో జోష్‌ను పెంచింది.
అదేవిధంగా వివిధ వర్గాలు, కులాలు, సంఘాల ప్రతినిధులు కలిసి బీఆర్ఎస్కు మద్దతుగా నిలుస్తున్నారు. రాజకీయ అనుభవం, కుటుంభ బలగం, సామాజిక సేవా ప్రతి నిధులు, అభ్యర్థి సోదరుడు మాజీ ఎమ్మెల్యేగా ఉండటం బీఆర్ఎస్ పార్టీకి బలం చేకూరుస్తుంది. సేవాభావంతో ఎంతోమందికి అండగా నిలిచిన పార్టీ అభ్యర్థికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుంది. గులాబీపార్టీ సైన్యంలో చేరేందుకు పలు పార్టీల నేతలు, కార్యకర్తలు ముందుకువస్తున్నారు. దీనితో గులాబీ దళంలో మరింత జోష్‌ను నింపుతుంది.
ఖాళీ అవుతున్న కాంగ్రెస్..!
గులాబీ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుండగా, కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిని ప్రకటించడంతో ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించిన నేతలు రాగిడి లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డిలు కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. వీరిలో రాగిడి లక్ష్మారెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ లో చేరారు. వీరితోపాటు చాలామంది నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరడంతో కాంగ్రెస్‌పార్టీ ఉప్పల్ నియోజకవర్గంలో ఖాళీ అవుతుంది. హబ్సిగూడలో కాలేరు జైనవీన్, ఉప్పల్‌లో పూడూరి జితేందర్‌రెడ్డి, రామంతాపూర్, చిలుకానగర్, నాచారం, మల్లాపూర్, చర్లపల్లి, కాప్రాకు చెందిన పలువురు నేతలు గులాబీ కండువాలు కప్పుకున్నారు. దీనితో కాంగ్రెస్‌కు భారీ నష్టం వాటిల్లింది.
బీజేపీలో అసమ్మతి..సాగని ప్రచారం
ఉప్పల్ నియోజకవర్గంలో బీజేపీలో అసమ్మతి కనిపిస్తుంది. గతంలో బీజేపీ టికెట్ కోసం పలువురు దరఖాస్తులు చేసుకున్నారు. తమ నాయకుడికే టికెట్ ఇవ్వాలం టూ సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టి, ప్రచారం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా కమల దళంలో ప్రచారానికి నేతలు ముందుకురావడంలేదు. అయితే వీటికి కారణం, టికెట్ ఖరారుపై అధిష్టానం ఎటు తేల్చకపోవడం. వీటికి తోడు ముందుండి నడిపించే నా యకులు వర్గాలుగా తమకే టికెట్ కేటాయించాలంటూ తమ గాడ్ పాదర్ల ద్వారా పైరవీలు చేస్తున్నారు. దీని తో ఇప్పటివరకు ఉప్పల్‌లో బీజేపీకి ప్రచారం చేయడానికి ఎవరు ముందుకురావడంలేదు.
టీడీపీలో అయోమయం..!
గతంలో బలంగా ఉన్న టీడీపీ పార్టీలో నాయకులు ఇతర పార్టీలలో చేరుతున్నారు. ఉప్పల్‌లో ఉన్న టీడీపీ నేతలు ఇటీవలే బీఆర్ఎస్లో చేరడంతో టీడీపీకి నేతల కొరత ఏర్పడనుంది. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు ఉప్పల్‌లో ఉండటం, టీడీపీ పోటీలో ఉంటుందా, ఉండదా అనేది ప్రశ్నర్థకంగా మారింది. గతంలో కాంగ్రెస్ తో పొత్తులో మద్దతు తెలిపిన టీడీపీకి కాంగ్రెస్ నుంచి ఎలాంటి స హకారం లభించలేదని విమర్శలు ఉన్నాయి. ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి టీడీపీ నేతలను, కార్యకర్తలను పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నా యి. ఒక్కొక్కరుగా టీడీపీ నేతలు ఇతర పార్టీలలోకి వెళ్తున్నారు. దీనితో టీడీపీ ఉనికి ప్రశ్నర్థకంగా మారింది.
బీఆర్ఎస్ను గెలిపించుకుంటాం..
ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటాం. హబ్సిగూడ డివిజన్లో పార్టీని బలోపేతం చేయడంతోపాటు, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమి స్తాం. ఎన్నో ఏళ్లుగా డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తు న్నాం. గతంలో కాంగ్రెస్‌లో పనిచేసినా అక్కడ సరైన గౌరవంలేదు. ప్రజల కోసం పనిచేసే బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమంతోపాటు పార్టీనేతలకు న్యా యం జరుగుతుందనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం.
– కాలేరు జైనవీన్, హబ్సిగూడ డివిజన్
కాంగ్రెస్‌ను ఓడించడమే లక్ష్యం..
ఉప్పల్‌లో కాంగ్రెస్‌పార్టీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తాం. కాంగ్రెస్‌లో పనిచేసేవారికి విలువలేదు. పార్టీలో సరైన విలువ, న్యా యం ద క్కడంలేదు. బీఆర్ఎస్తోనే అన్నివర్గాలకు న్యాయం జరుగుతుంది. ఉప్పల్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్ గల్లంతు కావడం ఖాయం. బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటాం. – జితేందర్‌రెడ్డి, ఉప్పల్