మణికొండ, మార్చి 8 : అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యతనిస్తూ ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ర్టాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని నార్సింగి మున్సిపాలిటీ మున్సిపాలిటీ చైర్పర్సన్ దారుగుపల్లి రేఖాయాదగిరి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నార్సింగి మున్సిపాలిటీ కార్యాలయంలో పారిశుధ్య మహిళా కార్మికులను సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్పర్సన్ రేఖ మాట్లాడుతూ.. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంరక్షణకు షీటీంలు, పోలీసుల భద్రతను మరింతగా పెంచి చట్టాలను పటిష్టపర్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్యబాబు, మహిళా కౌన్సిలర్లు అరుణజ్యోతి, విజేత, సునీత, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.
మణికొండ మున్సిపాలిటీలో…
మణికొండ మున్సిపాలిటీ పరిధిలో పంచవటికాలనీ, హుడాకాలనీల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా కౌన్సిలర్లు కేక్‌కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. కమిషనర్ కె.ఫల్గుణ్కుమార్ మహిళలను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వందన, శైలజా, హైమాంజలి, కావ్య, మీనా, ఆల్‌కాలనీస్ సమాఖ్య అధ్యక్షుడు డి.సీతారాం, కాలనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
మహిళలతోనే అభివృద్ధి సాధ్యం
శంషాబాద్ రూరల్, మార్చి 8 : మహిళలతోనే అభివృద్ధి సాధ్యమని శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ కోలన్ సుష్మారెడ్డి అన్నారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కోత్వాల్‌గూడలో మహిళా సంఘాల సభ్యులతో కలిసి కేక్ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పగుడాల లక్ష్మీశ్రీనివాస్, మున్సిపల్ అధికారి శివశంకర్,సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
పోలీస్‌స్టేషన్‌లో..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ శ్రీధర్‌కుమార్ ఆధ్వర్యంలో మహిళా సిబ్బందిని ఘనంగా సన్మానించారు. దీంతోపాటు ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో వేడుకలు నిర్వహించారు. పోలీస్ ఉద్యోగాలకు కోచింగ్ తీసుకుంటు న్న మహిళలతోపాటు మహిళా సిబ్బందిని డీసీపీ నారాయణరెడ్డి సన్మానించారు. ఏసీపీ భాస్కర్‌గౌడ్, సీఐ శ్రీనివాస్,ఎస్ఐ భానుమతి, సిబ్బంది పాల్గొన్నారు.
రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయంలో..
బండ్లగూడ, మార్చి 8: సృష్టికి మూలం స్త్రీలు కాబట్టి ఎక్కడైతే స్త్రీలను పూజించడం జరుగుతుందో అక్కడ ధర్మం, న్యాయం ఉంటుందని రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి అన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ పరిధిలోకి వచ్చే వివిధ పోలీస్స్టేషన్లలో పని చేస్తున్న మహిళా పోలీస్ సిబ్బందిని డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, అడిషనల్ డీసీపీ సాధనరేష్మి పేరముళ్లు సన్మానించి అభినందించారు. ఏసీపీలు గంగధర్, రమణగౌడ్, ఇన్స్పెక్టర్లు నాగేంద్రబాబు, మధు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్యాలయంలో మహిళా కార్పొరేటర్లు, మహిళా గ్రూప్ సంఘాల వారిని, సిబ్బందిని మేయర్ హహేందర్గౌడ్, కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి సన్మానించారు. కార్పొరేటర్లు సాగర్‌గౌడ్, మహిళా కార్పొరేటర్లు, అధికారులు, మాలకీరత్నం పాల్గొన్నారు.
సాఫ్ట్వేర్ రంగ శిక్షణలో అగ్రగామి రియల్ టైమ్ ఫ్యాకల్టీకి కేర్ఆప్ అడ్రస్‌గా నిలుస్తున్న క్వాలిటీ థాట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరబాద్ రాజేంద్రనగర్ కిస్మత్పూర్లో జరిగిన కార్యక్రమంలో క్వాలిటీ థాట్ తరఫున తోట రామక్రిష్ణ, చెరిస్ ఫౌండేషన్ నీలిమా పాల్గొన్నారు.
మైలార్‌దేవ్‌పల్లిలో…
మైలార్‌దేవ్‌పల్లి, మార్చి8: మైలార్‌దేవ్‌పల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, తన నివాసంలో మహిళలు భారీ సంఖ్యలో వచ్చారు. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా శాస్త్రీపురం డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలోని తలసేమియా సికిల్ సెల్ సొసైటీ నిర్వాహకులు ఘనంగా నిర్వహించుకున్నారు.
వ్యవసాయ యూనివర్సిటీలో…
వ్యవసాయ యూనివర్సిటీ : సమాజంలో మహిళల పాత్ర కీలకమైందని ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సుధీర్ కుమార్ అన్నారు.