కాచిగూడ, మే 11: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హయాంలో అంబర్‌పేట నియోజకవర్గం అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్చార్జి డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు. కిషన్‌రెడ్డిని తరిమికొట్టే పరిస్థితుల్లో ప్రజలున్నారని చెప్పారు.
అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆధ్వర్యంలో శనివారం సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్‌కు మద్దతుగా నిర్వహించిన ర్యాలీని దాసోజు శ్రవణ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎర్ర భీష్మాదేవ్, రవీందర్‌యాదవ్, ఓం ప్రకాశ్ యాదవ్, ధాత్రిక్ నాగేందర్ బాబ్జీ, కె.సదానంద్, తుమ్మల నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.