కందుకూరు/కందుకూరు, అక్టోబర్ 24 : ప్రజలకు అమ్మ కృప ఉండాలని బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకుడు కార్తిక్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని లేమూరు గ్రామంలో ప్రతిష్టించిన దుర్గామాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనను బీఆర్ఎస్ పార్టీ నాయకులు శాలువాలతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అమ్మ దయవల్ల రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధిస్తుందని చెప్పారు. అమ్మ దయ వల్ల ప్రజలందరూ, సుఖ సంతోషాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలు, కులాల వారికి ప్రాధాన్యతను ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలని, దేవాలయాలకు వెళ్లే అలవాటు చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, సర్పంచ్ పరంజోతి, వర్కింగ్ ప్రెసిడెంట్ మేఘనాధ్రెడ్డి, మాజీ సర్పంచ్ గణేశ్, యూత్ నాయకులు తాళ్ల కార్తిక్, సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్‌రెడ్డి, ఢిల్లి శ్రీధర్ ముదిరాజ్, జైపాల్, మోహన్‌రెడ్డి, మల్లేశ్, జంగయ్య, రహిమ్, ఉప సర్పంచ్ కొండల్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, దేవేందర్, రవీందర్, శ్రీనివాస్, కృష్ణ, ఐలయ్య, మహేశ్, వెంకటేశ్, ఆంజనేయులు పాల్గొన్నారు.
అగర్మియగూడలో…
మండల పరిధిలోని అగర్మియగూడలో బీఆర్ఎస పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ వడ్డెపల్లి రేవంత్‌రెడ్డి గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాతకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డి యాదవరెడ్డి, జనార్దన్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, సావంత్రెడ్డి, విజయ, పాపి భక్తులు పాల్గొన్నారు.
సబితా ఇంద్రారెడ్డి గెలుపునకు కృషి చేయాలి
కందుకూరు : నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సునాయసంగా గెలుస్తుందని మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. మంత్రి విజయం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. మంగళవారం మండల కేంద్రంలో యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్ల కార్తిక్, మండల సోషల్ మీడియా కన్వీనరుర్ బొక్క దీక్షిత్‌రెడ్డి, బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి కాసోజు ప్రశాంత్చారిలతో కలిసి మాట్లాడుతూ, ప్రతి పక్షాల అభ్యర్థులకు డిపాజిట్ దక్కనియ్యవద్దని కోరారు. నిరంతరం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. దాసర్లపల్లి గేటు వరకు మెట్రో, మెడికల్ కళాశాల పనులు పూర్తి కావాలంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.