మల్కాజిగిరి, ఏప్రిల్ 10 : దోమలవ్యాప్తిపై బీఆర్ఎస్ చేసిన పోరాటం ఫలించింది. అసెంబ్లీలో ప్రత్యేకంగా నగరంలో దోమల నివారణ చర్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. దోమలవ్యాప్తిని నివారించాలని పలు సందర్భాల్లో ప్రస్తావించారు. ప్రజలు దోమలతో ఇబ్బందులు పడుతున్నారని, వ్యాధులకు గురవుతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. ప్రజల ఇబ్బందులు గుర్తించి, సొంత ఖర్చులతో ఫాగింగ్ యంత్రాలు కొనుగోలు చేసి, కాలనీల్లో దోమల నివారణ చర్యలు చేపట్టారు.
అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పోరాటం చేశారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎంఎంసీ పరిధిలో ఫాగింగ్ కోసం నూతన యంత్రాలు కొనుగోలు చేశారు. ఈమేరకు కార్పొరేషన్ పరిధిలో శుక్రవారం పది యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా ఈ యంత్రాలు సేవలు అందించనున్నాయి. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లో పరిధిలో ఉప్పల్ జోన్‌కు 8, ఎల్బీనగర్కు 10, మల్కాజిగిరికి 10 వాహనాల చొప్పున కొనుగోలు చేశారు. కాగా, ఎల్బీనగర్ మూడు సర్కిళ్ల కార్యాలయంలో నూతన ఫాగింగ్ యంత్రాలు, వాహనాలను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రారంభించారు.