BRS | కందుకూరు, అక్టోబర్ 4 : అర్హులైన రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేయాలంటూ.. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో కందుకూరు మండల కేంద్రంలో శనివారం భారీ ధర్నా చేయనున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమల్లో విఫలమవ్వడం.. రుణమాఫీని పూర్తి స్థాయిలోఅర్హులైన రైతులకు వర్తింపజేయకపోవడాన్ని నిరసిస్తూ చేపట్టే ఈ ధర్నాలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు నేతలు పాల్గొననున్నట్లు ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి తెలిపారు.
ధర్నా ఏర్పాట్లపై పార్టీ నాయకులతో చర్చించారు. అధికారం కోసం అడ్డగోలు హామీలను ఇచ్చి వాటిని అమలు చేయకుండా పబ్బంగడుపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి.. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేసే వరకు వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.