ఉప్పల్, నవంబర్ 8 : ఉప్పల్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరేవిధంగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నా రు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నాచారంలోని పలు కాలనీల్లో కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్ ఆధ్వర్యంలో ఆయన ఇంటింటి పాదయాత్రను చేపట్టారు. ఈ పాదయాత్రలో అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పాల్గొని, ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వే యాలని అభ్యర్థించారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ, మ్యానిఫెస్టోను తెలియజేస్తూ ప్రచారం కొనసాగించారు. కాలనీల అభ్యున్నతి బాధ్యత నాదని, మీరు భరోసాగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.
చిలుకానగర్‌లో ప్రచారం
చిలుకానగర్ డివిజన్లోని పలు కాలనీల్లో బీఆర్ఎస్ సీనియర్ నేత బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచా రం నిర్వహించారు. ఈ మేరకు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ, కారు గుర్తుకు ఓటు వే యాలని అభ్యర్థించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో పాటు, మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా పథకాలు అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్‌గౌడ్, ఆటో శ్రీను, బాలేందర్, సుందర్, ఉపేందర్, గౌస్, షఫీ, నర్సింగ్, కుమార్, ప్రసాద్, చారి పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరికలు
చిలుకానగర్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకులు ఆకిటి బాల్‌రెడ్డి, మెట్టు ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు బుధవారం బీఆర్ఎస్లో చేరారు. ఈమేరకు అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి వారికి గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎడ్ల బాల్‌రెడ్డి, పిన్నపురెడ్డి మల్లారెడ్డి, ల్యాగ నర్సింహారెడ్డి, ల్యాగ సంతోష్‌రెడ్డి, పాతపల్లి శ్రీనాథ్‌రెడ్డి, పొన్నాల రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బీఎస్పీకి చెందిన ఎడ్ల పరమేశ్వర్, తదితరులు బీఆర్ఎస్లో చేరారు. అభ్య ర్థి బండారి లక్ష్మారెడ్డి, ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్‌రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సాయిజెన్ శేఖర్, మాస శేఖర్, మేడల మల్లికార్జున్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
కాప్రా డివిజన్లో..
కాప్రా, నవంబర్ 8: కాప్రా డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం బుధవారం కొనసాగింది. డివిజన్ పరిధిలోని పలు కాలనీలు, బస్తీల్లో బీఆర్ఎస్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు బూత్‌లవారీగా ప్రచారం నిర్వహించారు. డివిజన్ పరిధిలోని శ్రీశ్రీనగర్, ఓల్డ్కాప్రా కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని, ఉప్పల్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి, కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ బీఆర్ఎస్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు బద్రుద్దీన్, కొప్పులకుమార్, రవీందర్‌రెడ్డి, కృష్ణాగౌడ్,సాయి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.