కేపీహెచ్బీ కాలనీ, జనవరి 5: సమాజంలోని బ్రాహ్మణులకు అండగా ఉండి ఎల్లప్పుడు సేవలందిస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును బ్రహ్మణ సంఘాల అపరకర్మల భవన నూతన కార్యవర్గ సభ్యులు ఆదివారం మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందించగా, నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే సన్మానం చేసి అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మణుల అభివృద్ధికి ఎంతో కృషి చేసినట్లు తెలిపారు. కూకట్పల్లిలో నివసించే బ్రహ్మణుల కోసం కేపీహెచ్బీ కాలనీలో అపరకర్మల భవనం నిర్మించడంతో పాటు అన్ని రకాల వసతులు కల్పించినట్లు తెలిపారు. సమాజంలోని పేద బ్రహ్మణులకు ఎల్లప్పుడు అండగా ఉంటానని, వారి అభివృద్ధికి సేవలందిస్తానని తెలిపారు.
బ్రహ్మణ సంఘాల అపరకర్మల భవనం గౌరవ అధ్యక్షుడిగా కాండూరి నరేంద్రాచార్య, అధ్యక్షుడిగా వెంకటప్రగడ వెంకట సుబ్బారావు, ప్రధాన కార్యదర్శిగా ఆదుర్తి పంచగంగేశ్వర్లు ఎన్నికయ్యారు. కమిటీ కోశాధికారిగా నేమాని సూర్యనారాయణ మూర్తి, ఉపాధ్యక్షులుగా రామరాజు ప్రతాప్ కుమార్, తూండ్ల కమలాకర్ శర్మ, సీవీ రావు, సుశీల, రాజగోపాల్, కోదండ రామయ్య, గోపాలరత్నం, శేషగిరి, రామాన్, నరసింహాచార్యులు, సాయి, మైలవరపు భాస్కర్, కార్యవర్గ సభ్యులుగా గరికపాటి రమాదేవి, అనితశ్రీపాల్, సీహెచ్ రమాదేవి, కన్నలతలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ, బ్రహ్మణులను సంఘటితం చేసి, పేదల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అపరకర్మల భవనం నిర్మాణంలో ఎమ్మెల్యే అందించిన సహకారం మరువలేనిదన్నారు. కార్యక్రమంలో పలువురు బ్రహ్మణ సంఘం నేతలు పాల్గొన్నారు.
– నూతన కార్యవర్గం
బాలానగర్, జనవరి 5: సగరులకు అండగా ఉంటానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాలానగర్ సగర సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సగర సంఘం వారు ఎల్లప్పుడు తనకు అండగా ఉంటారని, సగరులకు ఎలాంటి ఆపద వచ్చినా తాను అండగా నిలుస్తానని ఆయన స్పష్టం చేశారు.
2025వ సంవత్సరానికి గాను స్వాగతం పలుకుతూ రూపొందించిన క్యాలెండర్ను ఆవిష్కరించినట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో సగరులు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సగరులు సమష్టిగా ఉండి ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యక్షులు దిండు లోకేశ్, జానకిరాం, ఆవుల రవి, గిరి సాగర్, రాజు సాగర్, అర్జున్, నాగరాజు, సురేందర్, గుంటి కృష్ణ, వెంకటలక్ష్మి, జయమ్మ, పూజ, లావణ్య పాల్గొన్నారు.