Boy Suicide | మన్సురాబాద్, మార్చి 7 : ప్రేమ విఫలమై ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్ పరిధిలోని మన్సురాబాద్‌కు చెందిన ఇరుగు రమేష్ కుమారుడు ఇరుగు విష్ణు(19) పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. ఇరుగు రమేష్ శుభకార్యానికి హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం సాయంత్రం బయటకు వెళ్ళాడు.
గురువారం రాత్రి 8:50 గంటలకు ఇంటి యజమాని రమేష్‌కు ఫోన్ చేసి విష్ణు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకుని రమేష్ పరిశీలించగా.. కుమారుడు విష్ణు ఇంటి సీలింగ్ రాడ్‌కు చీరతో ఉరివేసుకున్న దృశ్యం కనిపించింది. కొన్ని రోజులుగా విష్ణు ఓ యువతితో ప్రేమలో ఉన్నాడని.. సదరు యువతి ప్రేమను నిరాకరించడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు.