Secunderabad Kidnap Case | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. దారితప్పిన బాలుడు పొరపాటున డాడీ అని పిలిచినందుకు ఓ వ్యక్తి విపరీతమైన ఆలోచన చేశాడు. ఒంటరిగా ఉన్న అతను పిల్లాడిని పెంచుకోవాలనే ఆశతో ఇంట్లోనే నిర్బంధించాడు. అయితే కిడ్నాప్ గురించి సోషల్‌మీడియాలో వరుస కథనాలు వస్తుండటంతో భయపడిపోయి.. బాలుడితో సహా పోలీసులకు లొంగిపోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఉప్పల్ చిలుకానగర్ ప్రాంతంలో నివసించే రాపు రాజేశ్వరి కుమారుడు నిఖిల్ (5) తన అమ్మమ్మ స్వరూపతో కలిసి విజయవాడ వెళ్లేందుకు జూన్ 20వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. రైలు రావడానికి సమయం ఉండటంతో ఒకటో నంబర్ ఫ్లాట్‌ఫామ్‌పై స్వరూప మనమడితో కలిసి అక్కడ విశ్రాంతి తీసుకుంది. ఈ క్రమంలో స్వరూపకు నిద్రపట్టగా.. నిఖిల్ ఆమెకు చెప్పకుండా ఆడుకుంటూ బయటకు వెళ్లాడు. అయితే మెలుకువచ్చి చూసేసరికి నిఖిల్ కనబడకపోవడంతో స్వరూప ఆందోళన చెందింది. భయాందోళనతో తిరిగి ఉప్పల్‌కు చేరుకుని కూతురు రాజేశ్వరికి విషయం చెప్పింది.

Secunderabad Kidnap1
జూన్ 21వ తేదీన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలుడి మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్టేషన్ పరిధిలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో ఓ వ్యక్తి బాలుడిని తీసుకెళ్తుండటం గుర్తించారు. ఆ ఫుటేజీ ఆధారంగా బాలుడి ఆచూకీ కోసం గాలించారు. కానీ లాభం లేకుండా పోయింది. ఈ క్రమంలో జూలై 2వ తేదీన నిందితుడే నేరుగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. నిందితుడిని ఏపీలోని రాజోలుకు చెందిన షేక్ అహ్మద్ అని తెలిపారు. కొంతకాలంగా చింతల్ రాంనగర్ పరిధిలో నివసిస్తున్నాడని చెప్పారు.
కాపురంలో మనస్పర్థల కారణంగా అతని భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఒంటరితనంతో షేక్ అహ్మద్ ఒంటరితనంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో దారితప్పి వచ్చిన బాలుడు తనను డాడీ అని పిలవడంతో ఎంతో మురిసిపోయాడు. ఎలాగైనా బాబును పెంచుకోవాలని నిర్ణయించుకుని తన వెంట తీసుకెళ్లాడు. అలా 12 రోజుల పాటు ఇంట్లో ఉంచుకున్న అలీ.. చివరకు పోలీసులకు అప్పగించాడు. కాగా, నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పిల్లాడిని తల్లి రాజేశ్వరికి అప్పగించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్
గత నెల జూన్ 20వ తేదీన కిడ్నాప్, 11 రోజులు గడిచినా లభించని ఆచూకీ
ఉప్పల్ చిలకనగర్ ప్రాంతంలో తన కొడుకు నిఖిల్(5), తల్లి స్వరూపతో కలిసి నివసిస్తున్న రాపు రాజేశ్వరి అనే మహిళ
గత నెల 20వ తేదీన కుటుంబ కలహాల నేపథ్యంలో తన మనవడిని… pic.twitter.com/b7pL2cNvvy
— Telugu Scribe (@TeluguScribe) July 2, 2026