ఈ బాలుడి గిటార్ స్కిల్స్ అదుర్స్.. ఏ గిటారిస్ట్ సాధించని రికార్డు సొంతం
ఈ వయసులోనే గిటార్లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. అతడే డేనియల్ గెయిలెస్. హైదరాబాద్‌కు చెందిన డేనియల్ రాక్, పాప్ కేటగిరీలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో
గిటార్ నేర్చుకోవడం అంత ఈజీ కాదు. దాని కోసం ఎంతో సాధన చేయాలి. చాలా ఏళ్ల పాటు కష్టపడాలి. అప్పుడే గిటార్ నుంచి సరైన ట్యూన్స్ వస్తాయి. కానీ.. ఓ బాలుడు మాత్రం గిటార్‌ను అవలీలగా నేర్చేసుకున్నాడు. వయసు చూస్తే 11 ఏళ్లే. కానీ.. ఈ వయసులోనే గిటార్లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. అతడే డేనియల్ గెయిలెస్. హైదరాబాద్‌కు చెందిన డేనియల్ రాక్, పాప్ కేటగిరీలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. అంతే కాదు.. రాక్ అండ్ పాప్‌లో 8వ గ్రేడ్ సాధించి అత్యంత చిన్నవయసు ఉన్న వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు.

ఒకరోజు నేను క్రికెట్ అకాడెమీ నుంచి తిరిగి వస్తున్నా. మా నాన్న ఓ స్టూడెంట్‌కు గిటార్ నేర్పించడం చూశా. దీంతో నేను కూడా కాసేపు అక్కడే ఉండి.. మా నాన్న ఏం చెబుతున్నాడో శ్రద్ధగా విన్నా. వైట్‌బోర్డ్‌పై అలాగే చూస్తున్నా. ఇంతలో నాన్న నన్ను చూసి గిటార్ ప్లే చేయి అన్నాడు. దీంతో నేను గిటార్ ప్లే చేయడం చూసి మా నాన్న షాక్ అయ్యాడు. అప్పటి నుంచి నాకు గిటార్ నేర్పించడం ప్రారంభించాడు. లాక్ డౌన్ టైమ్‌లో ఫిబ్రవరి 2020 నుంచి గిటార్ నేర్చుకోవడం ప్రారంభించా.. అంటూ చెప్పుకొచ్చాడు డేనియల్.
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌తో పాటు.. ఏసియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌ను కూడా డేనియల్ సాధించాడు. లండన్‌లోని ట్రినిటి కాలేజీ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్, సింగింగ్, పియానో, ఎలక్ట్రానిక్ కీబోర్డ్స్, బ్రాస్ లాంటి ఇన్‌స్ట్రుమెంట్స్‌పై గ్రేడింగ్ క్వాలిఫికేషన్స్ సర్టిఫికెట్లను అందిస్తుంది. దీంట్లో గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 8 వరకు అవార్డు ఉంటుంది. అవి లేవల్స్ అన్నమాట.

అందులో అన్ని లేవల్స్ దాటుకొని గ్రేడ్ 8ను అతి తక్కువ వయసులో సాధించాడు డేనియల్.
ప్రస్తుతం డేనియల్ కోల్‌కతాలోని ప్రఖ్యాత గిటారిస్ట్ సుమిత్ రామచంద్రన్‌కు మెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు. తనకు యూట్యూబ్ చానెల్ కూడా ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోని టాప్ గిటారిస్టులలో డేనియల్ ఒకరు. గిటారిస్టుగా ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న వాళ్లు కూడా సాధించలేని ఫీట్ సాధించి డేనియల్ చరిత్ర సృష్టించాడు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

