కేపీహెచ్‌బీ కాలనీ, ఆగస్టు 10 : షటిల్ కాక్ తీయడానికి ప్రయత్నిస్తుండగా…విద్యుత్‌షాక్‌తో బాలుడు మృతి చెందిన సంఘటన కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఏపీలోని బాపట్ల మండలం,ఖాజ పాలెంకు చెందిన కొట్టూరు ప్రేమ్‌చరణ్ తన కొడుకు విజయ్కార్తీక్తో కలిసి తన బావమరిది నివసించే…కేపీహెచ్‌బీ కాలనీలోని వసంతనగర్ కాలనీ, భగత్‌సింగ్ నగర్ కాలనీ ఫేజ్-2లోని ప్రివిలేజ్ అపార్ట్‌మెంట్‌కు వచ్చాడు.
మధ్యాహ్నం సమయంలో విజయ్‌కార్తీక్ తన బావమరిది కొడుకుతో కలిసి ఇంటి కాంపౌండ్ వాల్ లోపల షటిల్ ఆడుతున్నారు. ఈ క్రమంలో షటిల్‌కాక్ ట్రాన్స్ఫార్మర్పై పడింది. ఈ కాక్‌ను తీయడానికి యత్నించిన విజయ్ కార్తీక్ కరెంట్‌షాక్ తగిలి కిందపడిపోయాడు. వెంటనే అతడిని వైద్యశాలకు తరలించగా…అప్పటికే బాలుడు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.