Police attack : బోరబండ ఎస్సై షేక్ నాగుల్ దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదంగా మారింది. అకారణంగా ఆయన సంతోష్ అనే అడ్వకేట్‌పై దాడికి పాల్పడినట్లు వార్తలు రావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయవాది సంతోష్‌పై దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని న్యాయవాద సంఘాలు పేర్కొన్నట్లు తెలిసింది. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను ఎస్సై షేక్ నాగుల్ తన బృందంతో కలిసి తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో సరళ అనే మహిళ ఇంటి నుంచి 136 బాటిళ్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మరో ఇంటి తలుపుతట్టగా ఆ ఇంట్లో ఉంటున్న అడ్వకేట్ సంతోష్ వెంటనే డోర్ తీయలేదు. తలుపు తడుతుంటే ఇంత ఆలస్యంగా డోర్ తీస్తావా అంటూ ఎస్సై న్యాయవాది సంతోష్‌పై దాడి చేసినట్లు తెలిసింది.
అతడిని లుంగీ, బనియన్పైనే పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లనట్లు సమాచారం. అడ్డువచ్చిన న్యాయవాది భార్యను కూడా అభ్యంతరకర పదజాలంతో తిట్టినట్లు తెలిసింది. దాంతో ఏ కారణం లేకుండా, అడ్వకేట్ అనే మర్యాద కూడా లేకుండా తనపై దాడికి పాల్పడిన ఎస్సైపైన చర్యలు తీసుకోవాలని ఎస్సై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అడ్వకేట్ సంతోష్ కూకట్పల్లి బార్ అసోసియేషన్‌లో పనిచేస్తున్నట్లు తెలిసింది.