ఉస్మానియా యూనివర్సిటీ : మాజీ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు రాసిన ‘ఇస్సా – ఇజ్జత్ – హుకుమత్’ పుస్తకాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో సోమవారం ఆవిష్కరించారు. బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ (బీసీఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదుల యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ బీసీ సమాజం తమ వాటా, ఆత్మగౌరవం, అధికారం సాధించేందుకు ఈ సిద్ధాంత గ్రంథం మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు.
భవిష్యత్ తరాలకు ఇది ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు. సమాజంలో సమానత్వం, న్యాయం సాధించేం దుకు ఈ గ్రంథం ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు పేర్ల బాలు, నామ సైదులు, వెంబటి సురేశ్, గౌతమ్, అభిలాష్, నరేశ్, నవీన్, శేఖర్, చందు, మురళి తదితరులు పాల్గొన్నారు.