అమీర్పేట మార్చి 16 : విశ్వనాథ సాహిత్య పీఠం పక్షాన పీఠం చైర్మన్ వెలిచాల కొండలరావు(Kondal rao) తెలుగులోకి అనువదించిన 8 గ్రంథాల ఆవిష్కరణ ఆదివారం అమీర్పేట డీకే రోడ్లోని సిస్టర్ నివేదిత స్కూల్ ఆడిటోరియంలో జరిగింది. ఈ పుస్తకావిష్కరణ సభకు ముఖ్యఅతిథిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి హాజరై తెలుగులోకి అనువదించిన ‘ఈ కాలపు మానవుని సందిగ్ధావస్థ’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
దీంతోపాటు హర్ రూమ్, గాలిబ్స్ కప్లేట్స్, మోచిరామ్, రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు గీతాంజలి వంటి ప్రసిద్ధ పుస్తకాలను అనువదించిన విశ్వనాథ సాహిత్య పీఠం చైర్మన్ డాక్టర్ వెల్చాల కొండలరావు సాహితీ సేవలను వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హరి గోపాల్, బి నర్సింగ్ రావు, నలిమెల భాస్కర్, ప్రొఫెసర్ కె వీరారెడ్డి ప్రొ.వి విశ్వనాథం ప్రొ.యాదగిరిరావు తదితరులు పాల్గొన్నారు.