పాతనగరంలో ఘనంగా బోనాలు
గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో ప్రారంభమై రెండు పూజలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ ఆరెళ్ల జగదీశ్ యాదవ్, ఈవో శ్రీనివాస రాజు నేతృత్వంలో ఆలయ హుండీని లెక్కించారు.
గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయం హుండీ లెక్కింపు
మెహిదీపట్నం, జూన్ 27 : గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో ప్రారంభమై రెండు పూజలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ ఆరెళ్ల జగదీశ్ యాదవ్, ఈవో శ్రీనివాస రాజు నేతృత్వంలో ఆలయ హుండీని లెక్కించారు. రెండు పూజలకు సంబంధించి 2 లక్షల 38వేల 695 రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ చైర్మన్ జగదీశ్ యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో జగదాంబిక ఎల్లమ్మ ఆలయ పూజారి సర్వేశ్వర్చారి, ఆలయ ఇన్స్పెక్టర్ ధీరజ్, సభ్యులు శ్రీకాంత్, నర్సింగ్ రావు, రాము, విజయలక్ష్మి, దిలీప్ , కులవృత్తుల సంఘం చైర్మన్ బి.సాయిబాబాచారి, సభ్యులు శ్రీధర్, శ్రీకాంత్ చారి , మహంకాళి ఆలయం పూజారి సురేశ్ చారి పాల్గొన్నారు.
ఉస్మానియా దవాఖానలో ..
సుల్తాన్‌బజార్, జూన్ 27 : ఉస్మానియా దవాఖానలో బోనాలు మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బోనాల ఉత్సవ కమిటీ అధ్యక్షులు వి. రమేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్, అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ బి. త్రివేణి, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ-1 డాక్టర్ బి. శేషాద్రి, డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ బండారి శ్రీనివాసులు, డాక్టర్ రఫీ, డాక్టర్ విజయ్‌భాస్కర్ పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించారు. డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సాయిశోభ, అసిస్టెంట్ ఆర్‌ఎంఓలు డాక్టర్ సుష్మ, డాక్టర్ అనురాధ, డాక్టర్ మాధవి, డాక్టర్ కవిత, నర్సింగ్ సూపరింటెండెంట్ సుజాత రాథోడ్ దవాఖాన ఆర్ఎంఓ కార్యాలయం నుంచి పాత భవనంలోని నల్లపోచమ్మ ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో బోనాల ఉత్సవ కమిటీ ప్రతినిధులు సీహెచ్ సాయిరామ్, జి. అశోక్, జి. జగన్, పి. దేవేందర్, బి. మహేందర్, ఎ. ధన్‌రాజ్, కమల్, సూర్యప్రకాశ్, మహేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

