భాగ్యనగరం బోనమెత్తింది. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల నడుమ ‘అమ్మా బైలెల్లినాదో.. తల్లీ బైలెల్లినాదో..’ అంటూ.. మహానగరం భక్తిపరవశంలో మునిగిపోయింది.

కొలిచే భక్తుల కొంగు బంగారంగా నిలిచే అమ్మవారికి భక్తులు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఒడి బియ్యం పోసి, కల్లు సాక పెట్టి పిల్లాపాపలను చల్లంగా చూడాలని, వ్యాపార సముదాయాలు వృద్ధి చెందేలా దీవించమని వేడుకున్నారు.


