ఖైరతాబాద్, డిసెంబర్ 9 : లోక్‌భవన్‌కు గుర్తుతెలియని వ్యక్తి బాంబు బెదిరింపు మెయిల్ చేశాడు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లోక్‌భవన్ ప్రధాన కార్యాలయం మెయిల్‌కు ఓ వ్యక్తి మెయిల్ పంపించాడు. అందులో లోక్‌భవన్‌తో పాటు ప్రజాభవన్‌ను పేల్చేస్తామంటూ పేర్కొన్నారు.
అప్రమత్తమైన సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో లోక్‌భవన్, ప్రజాభవన్‌లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి ప్రమాదం లేదని గుర్తించి ఫేక్ మెయిల్‌గా నిర్ధారించారు. ఈ మేరకు కేసును సీసీఎస్‌కు బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు.