
సికింద్రాబాద్, డిసెంబర్ 11 : అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. బోర్డు పరిధిలోని సిఖ్ విలేజ్ ఆదినాథ్ భవన్లో పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్, రాంకీ ఫాండేషన్, గురునానక్ కళాశాల, శ్రీకాంత్ అసోసియేట్స్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ రక్తదానంతో ఆపదలో ఉన్న వారిని ఆదుకోగలుగుతామని పేర్కొన్నారు. ఈ శిబిరంలో సుమారు 200 మంది రక్తదానం చేశారు. అడిషనల్ డీసీపీ మధుకర్ స్వామి సేవలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని కొనియాడారు. అనంతరం రక్తదానం చేసిన యువతకు సర్టిఫికెట్లు ఎమ్మెల్యే సాయన్న అందజేశారు. తలసేమియా అండ్ సికెల్ సెల్ సొసైటీ, ఉప్పల వెంకయ్య మెమోరియల్ బ్లడ్ బ్యాంక్ రక్తనిధి కేంద్రం వైద్య బృందం సేకరించారు. కార్యక్రమంలో రాంకీ ఫౌండేషన్ ప్రతినిధి రాంరెడ్డి, అడ్వకేట్ కాత్యాయనీ, శ్రీకాంత్, బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్, పాండుయాదవ్, నేతలు భానుక మల్లికార్జున్, నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ, టీఎన్ శ్రీనివాస్, నివేదిత, తేజపాల్, మురళీయాదవ్ తదితరులు పాల్గొన్నారు.