రంగారెడ్డి : పహల్గాం ఉగ్రదాడికి, భారత్‌పై పాకిస్తాన్ దాడులకు నిరసనగా ఆదివారం శంషాబాద్‌లోని కరాచీ బేకరీ ముందు బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. బీజేపీ కార్యకర్తలు జాతీయ జెండాలను ప్రదర్శించి నిరసనకు దిగారు. పాకిస్తాన్‌కు, కరాచీ బేకరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇండియన్ ఆర్మీని ప్రశంసించారు.
ఈ క్రమంలో కొంత మంది బీజేపీ కార్యకర్తలు కరాచీ బేకరీ బోర్డును కర్రలతో ధ్వంసం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఉద్రిక్తతలకు తావివ్వకుండా చర్యలు తీసుకున్నారు. బేకరి పేరు మార్చాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. విశాఖపట్నంలోని కరాచీ బేకరీ అవుట్లెట్లలో కూడా ఇలాంటి నిరసనలు జరిగాయి.
ఇండియా – పాక్ కాల్పుల విరమణ
హైదరాబాద్ – శంషాబాద్‌లో కరాచీ బేకరీ మీద దాడి చేసిన బీజేపీ నేతలు pic.twitter.com/zMLhOvWsgb
— Telugu Scribe (@TeluguScribe) May 11, 2025