NEET | సుల్తాన్‌బజార్, జూన్ 15: ప్రధాని నరేంద్రమోదీ డౌన్ డౌన్ అంటూ ఎన్ఎస్యూఐ నాయకులు, మరో వైపు సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్యకర్తల నినాదాలతో నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయం ప్రాంగణం ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. నీట్ పరీక్షలో స్కాం జరిగిందంటూ ఎన్ఎస్యుఐ నాయకులు నాంపల్లి బీజేపీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
దీంతో ఎన్ఎస్యూఐ నాయకులు పెద్ద ఎత్తున మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎన్ఎస్యూఐ నాయకులకు దీటుగా సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్యకర్తలు పోటా పోటీగా నినాదాలు చే శారు. అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకొని బీజేపీ ప్రధాన కార్యాలయం ముట్టడికి యత్నించిన ఎన్ఎస్యూఐ నాయకులను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.