కవాడిగూడ, నవంబర్ 6 : ముషీరాబాద్‌లో గులాబీ జెండాను ఎగుర వేసేందుకు ప్రతి కార్యకర్త, నాయకులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఎమ్మెల్యే, ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ పిలుపునిచ్చారు. సోమవారం కవాడిగూడ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ఎన్డీ సాయికృష్ణ, పానుగంటి ప్రభాకర్, సంతోష్, గొల్లగడ్డ రాజశేఖర్ గౌడ్, వేణు, సంతోష్ ఆధ్వర్యంలో దోమలగూడ ఎంసీహెచ్ క్వార్టర్స్, వినాయక్‌నగర్ బీజేపీ నాయకులు చింతల హరీశ్ యాదవ్, మహేశ్, నర్సింగ్ రావు, ప్రవీణ్, శంకర్, ఎస్సీమోర్చా ఉపాధ్యక్షుడు సంజీవ్, సురేశ్ గౌడ్, జగన్ గౌడ్, రాకేశ్, శ్రీనివాస్ యాదవ్‌లతో పాటు దాదాపు వంద మంది బీజేపీ నాయకులు ఎమ్మెల్యే ముఠా గోపాల్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేయాలని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రతి ఓటరుకు వివరించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరాలని అన్నారు.
ముషీరాబాద్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని అన్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా తనను అధిక మెజారిటీతో గెలిపిస్తే నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వల్లాల శ్రీనివాస్ యాదవ్, రాజు యాదవ్, వల్లాల రవి యాదవ్, మల్లేశ్, రాము, బీమ్‌రావ్, అన్వర్, రాంచందర్, సాయి, శివకృష్ణ, వరప్రసాద్, బాబు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.