
అమీర్‌పేట్, డిసెంబర్ 20 : ధాన్యం సేకరణలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ సనత్‌నగర్ డివిజన్లోని బస్టాండ్ చౌరస్తాలో కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కొల ను బాల్‌రెడ్డి, సంతోష్ సరఫ్, ఫాజిల్, పుట్టల శేఖర్, ఖలీల్‌బేగ్, రాజు తదితరులు కేంద్ర ప్ర భుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకున్న తరహాలోనే ధాన్యం కొనుగోళ్లు చేసేవరకు నిరసన చేస్తామన్నారు.
కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు..
ఎర్రగడ్డ: కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బోరబండలో టీఆర్ఎస్ శ్రేణులు సోమవారం పెద్ద ఎత్తున ధర్నా చేశారు. బోరబండ చౌరస్తా వద్ద కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ నేతృత్వంలో అరగంట పాటు నిరసన నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ పని తీరుపై అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్నారు. ముఖ్యంగా అన్నదాతలపై మోదీ ప్రభుత్వం వివక్ష చూపుతుందన్నారు. పార్టీ నేతలు ఆనంద్, ధర్మ, రమేష్‌నాయక్, రాములు, మహ్మద్‌యూసుఫ్, లడ్డు, రమేశ్‌యాదవ్, ఇమ్రాన్ పాల్గొన్నారు.