శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Hyderabad - Jan 18, 2021 , 05:57:39

భయం వద్దు.. బర్డ్‌ఫ్లూ లేదు

భయం వద్దు.. బర్డ్‌ఫ్లూ లేదు

 బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు లేవని పశు సంవర్ధక శాఖ అధికారులు నిర్ధారిస్తున్నారు. మేడ్చల్‌ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఫౌల్ట్రీలలోని కోళ్ల నుంచి వారం రోజులుగా  శాంపిళ్లను సేకరిస్తున్నారు. సేకరించిన శాంపిళ్లను  వీబీఆర్‌ఐ (వెటర్నరీ బయోలాజికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌)లో పరిశీలించారు. శాంపిల్స్‌లో ఎలాంటి బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు కనబడలేదని, ఫౌల్ట్రీ యజమానులు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడిస్తున్నారు. 

మేడ్చల్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాలలో 83 ఫౌల్ట్రీలు ఉన్నాయి. ఇప్పటి వరకు  పశు సంవర్ధక శాఖ సిబ్బంది 55 ఫౌల్ట్రీలను సందర్శించి కోళ్ల నుంచి శాంపిల్స్‌ను సేకరించారు. ఇందు లో కోళ్ల రక్తంతో పాటు ముక్కులో నుంచి కారే జిగురు పదార్థాన్ని శాంపిల్స్‌గా సేకరించి, చనిపోయిన కోళ్ల నుంచి ఊపిరితిత్తులు, లివర్‌ను సేకరించి వీబీఆర్‌ఐ(వెటర్నరీ బయోలాజికల్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌)లో పరీక్షలు జరిపి బర్డ్‌ఫ్లూ లక్షణాలు లేవని నిర్ధారించి ధ్రువీకరించినట్లు మేడ్చల్‌ జిల్లా పశు సంవర్ధకశాఖ జిల్లా అధికారి శేఖర్‌ వెల్లడించారు. 83 ఫౌల్ట్రీలలో 35 లక్షల పైచిలుకు కోళ్లు ఉం డగా 55 ఫౌల్ట్రీలలో లక్షల్లో కోళ్ల శాంపిళ్లను సేకరించారు. కోళ్ల నుంచి బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందకుండా పశు సంవర్ధక శాఖ అధికారులు చర్యలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. 

బర్డ్‌ఫ్లూపై ఆందోళన అవసరంలేదు

బర్డ్‌ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఆదేశా ల మేరకు జిల్లా పరిధిలోని ఫౌల్ట్రీలోని కోళ్లనుంచి సేకరించిన శాంపిళ్ల లో ఎలాంటి బర్డ్‌ ఫ్లూ లక్షణాలు కనిపించలేదని వీబీఆర్‌(వెటర్నరీ బయోలాజికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌)లో నిర్ధారించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చికెన్‌, గుడ్లను ఎలాంటి భయం లేకుం డా తినవచ్చన్నారు. జిల్లాలోని 83 ఫౌల్ట్రీలకు గాను 55 ఫౌల్ట్రీలలో కోళ్ల నుంచి శాంపిళ్లను సేకరించాం. మిగతా ఫౌల్ట్రీలలో త్వరలోనే శాంపిళ్ల సేకరణను పూర్తి చేసి, నిర్ధారణకు వస్తాం. - మేడ్చల్‌ జిల్లా పశు వైద్య, పశు సంవర్ధక శాఖాధికారి, డాక్టర్‌ శేఖర్‌

ప్రభుత్వ ఆదేశాల మేరకు శాంపిళ్ల సేకరణ

ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభు త్వ ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన చర్యలను పశు సంవర్ధక శాఖ అధికారులు చేపట్టారు. ఈ నెల ఏడవ తేదీ నుంచి  పశు సంవర్ధక శాఖ సిబ్బంది వివిధ పౌల్ట్రీలను సందర్శించి కోళ్ల నుంచి శాంపిల్స్‌ను సేకరిస్తూ ఫౌల్ట్రీ యజమానులకు అవగాహన కల్గిస్తున్నారు. కోళ్లు ఆకస్మికంగా చనిపోతే జిల్లా పశు సంవర్ధక శాఖకు సమాచారం అందించాలని అధికారులు యాజ మాన్యాలను కోరుతున్నారు. నేటి నుంచి మేడ్చల్‌ జిల్లా వ్యాప్తంగా బర్డ్‌ ఫ్లూపై ఫౌల్ట్రీ యజమానులకు అవగాహన కల్గించే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించనున్నారు. 

VIDEOS

logo