సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో ఇంజినీరింగ్ మాయజాలం వెలుగులోకి వచ్చింది. చేయని పనులకు చేసినట్లుగా బిల్లులు పెట్టి ఖజానాను గండి కొట్టారు ఇంజినీర్లు. దాదాపు తొమ్మిండేండ్ల కిందట బిల్లులు సైతం ఫైనాన్స్ విభాగానికి వస్తుండడంతో గత కమిషనర్ ఇలంబర్తి అనుమానం వ్యక్తం చేసి ఇంజినీరింగ్ పనులపై విజిలెన్స్ విచారణను ఆదేశించారు. రంగంలోకి దిగిన విజిలెన్స్ విభాగం గడిచిన కొన్ని రోజులుగా విచారణ చేపట్టిన అధికారులు నివేదికను అందజేశారు.2016 నుంచి 2023 వరకు జరిగిన నిర్వహణ పనులపై విచారణ చేపట్టిన సుమారు 46 పనులపై విజిలెన్స్ విచారణ చేపట్టగా…ఇందులో 23 ప్రాంతాల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించి కమిషనర్ ఇచ్చిన నివేదికలో తేల్చారు.
ఇందులో భాగంగానే కమిషనర్ ఆదేశాల మేరకు సీఈ (నిర్వహణ) సహదేవ్ రత్నాకర్ ఎల్భీనగర్, చార్మినార్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్‌లో జోనల్ సూపరింటెండెంట్ ఇంజనీర్లు, సర్కిల్లు కాప్రా, ఉప్పల్, హయత్‌నగర్, చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, చయందానగర్, ఆర్సీ పురం, మల్కాజిగిరి , సికింద్రాబాద్, బేగంపేట సర్కిళ్లలో ఈఈలు తమ పనులపై వచ్చిన అభ్యంతరాలను నివేదికను సమర్పించాలని ఈ నెల 3న ఆదేశాలను జారీ చేశారు. ఈ జాబితాలో కూకట్పల్లి సర్కిళ్లలో మినహా అంతటా నిర్వహణ పనుల్లో అక్రమాలు జరిగినట్లు తేల్చారు. ఈ నివేదికపై కొత్త కమిషనర్ ఆర్ వీ కర్ణన్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది