బంజారాహిల్స్, మే 25 : బైక్‌పై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన యువకుడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం బంజారాహిల్స్ రోడ్ నం.5 పరిధిలోని దేవరకొండ బస్తీకి చెందిన షాదాబ్ (19) అనే యువకుడు జెప్టో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల షామీర్పేట్ ప్రాంతంలో బైక్‌పై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ వీడియోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు స్పందించి విచారణ చేపట్టారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా రోడ్లపై నిర్లక్ష్యంగా విన్యాసాలు చేసినందుకు షాదాబ్‌పై కేసు నమోదు చేసి, అతను వినియోగించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి స్టంట్స్ చేయవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.