సిటీబ్యూరో: రానున్న గణేశ్ ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, శాంతియుత వాతావరణంలో జరిగేలా భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సహకారం అందించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ పేర్కొన్నారు.
సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 27 ప్రారంభమై వచ్చే నెల 6న పూర్తి కానున్న గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి, సంబంధిత శాఖల అధికారులతో కమిషనర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఇప్పటికే గ్రేటర్లో అధిక వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపడుతున్నట్లు కమిషనర్ చెప్పారు. గణేశ్ ప్రతిమల ఊరేగింపు జరిగే జాతీయ రహదారుల్లో ఏమైనా రోడ్లు దెబ్బతింటే వాటిని కూడా చేపడతామని తెలిపారు.